![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -497 లో......వల్లి దగ్గరికి చందు వచ్చి.. నీ కడుపులో ఉన్న మన బిడ్డ హార్ట్ బీట్ వినాలని ఉందని అంటాడు. బిడ్డనే లేదు ఎలా హార్ట్ బీట్ వస్తుందని వల్లి షాక్ అవుతుంది. వల్లి కడుపు దగ్గర చందు తలపెట్టి నాకు హార్ట్ బీట్ వినిపిస్తుందని అంటుంటే వల్లి, సుకన్య షాక్ అవుతారు. చందు వెళ్తుంటే బా మా నాన్నని రైస్ మిల్ కి తీసుకొని వెళ్ళమని శ్రీవల్లి అనగానే.. సరే అని చందు అంటాడు. ఆ తర్వాత లేని బిడ్డ హార్ట్ బీట్ ఎలా వినిపించిందని వల్లిని సుకన్య అడుగుతుంది. టెన్షన్ కి అలా అయిందేమోనని వల్లి అంటుంది. ఆ తర్వాత మా నాన్నని మిల్ కి తీసుకొని వెళ్తున్నాడని వల్లి, సుకన్య హ్యాపీగా ఫీల్ అవుతు డాన్స్ చేస్తారు.
వాళ్ళు అలా చేస్తుంటే నర్మద, ప్రేమ చూస్తారు. అసలు ఆ వల్లి కడుపుపై ఇంకా డౌట్ గానే ఉంది ఎలాగైనా కనిపెట్టాలని వేదవతి దగ్గరికి ప్రేమ, నర్మద వెళ్తారు. నువ్వు ఏంటే వేరు కాపురం పెట్టావ్ కదా.. ఎందుకు వచ్చావని వేదవతి అంటుంది. మీరు ఆపండి అత్తయ్య అని నర్మద అంటుంది. వల్లి అక్క ప్రెగ్నెంట్ కదా ఇప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోవాలి.. మేం తనని చూసుకుంటాం.. ఆ విషయం ఇంటికి పెద్దగా మీరు ఆర్డర్ వేసి చెప్పాలని నర్మద అంటుంది. దాంతో వేదవతి సరే అంటుంది. మరొకవైపు మిల్ కి ఆనందరావుని చందు తీసుకొని వెళ్తాడు.
ఆ తర్వాత వల్లిని వేదవతి పిలుస్తుంది. ఇక నుంచి నిన్ను నర్మద, ప్రేమ జాగ్రత్తగా చూసుకుంటారని చెప్తుంది. ఎందుకు నేనున్నాను కదా అని సుకన్య అంటుంది. నువ్వు ఒక తింగరి.. అదొక తింగరి.... నా మాటకి ఎదరు చెప్పొద్దని వేదవతి అంటుంది. అక్కా.. పదా నువ్వు ఇప్పుడు యోగ చెయ్యాలని శ్రీవల్లిని నర్మద, ప్రేమ తీసుకొని వెళ్తారు. వల్లిని తీసుకొని వెళ్లి వల్లి చేత యోగ చేయిస్తారు. ఆ తర్వాత నర్మద కోసం సాగర్ తినడానికి బర్గర్ తీసుకొని వస్తాడు. కావాలనే అందరి ముందు తనకి ఇస్తాడు సాగర్. ఇక. సాగర్ ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపు ధీరజ్, ప్రేమ, నర్మద తిరుపతి, వేదవతి తింటారు. అప్పుడే సాగర్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |